శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

గో సంరక్షణ పథకం

గో సంరక్షణ పథకం ఓం శివశక్తి పీఠం గోశాల వారి గో సంరక్షణ పథకం ద్వారా భక్తుల అభీష్టo మేరకు గోవులను పెంచి, పోషించి వాటి ఫలితములను పొందాలనుకునే వారికి గోవులు ఉచితంగా ఇవ్వబడును. మిగిలిన వివరములకు ఆశ్రమ సిబ్బందిని సంప్రదించగలరు.

1. ఆవు ప్రాముఖ్యతను తెలియచేసే సాహిత్యాన్ని మనం చదవాలి. ప్రధానంగా ఇంట్లోని యువతరంచేత చదివించాలి. గోమాతపట్ల భక్తిని పిల్లలలో కల్గించాలి.

2. రోజువారీ జీవితంలో, గోఉత్పత్తులు - పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ, పండ్లపొడి, అగరువత్తులు... ఇలాంటి వినియోగ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి.

3. గోమూత్రంద్వారా తయారయ్యే మందులను - ఇంట్లోని సభ్యులందరూ వాడేటట్లు ప్రోత్సహించాలి.

4. దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు - ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్లు చూడాలి.

5. గోశాలలను కుటుంబసమేతంగా సందర్శించడం, వారికి ఆర్థికంగా సహకరించడం చేయాలి. గోశాల నిర్వహణలో సమయమిచ్చి కార్యకర్తగా పనిచేయవచ్చును.

6. సంవత్సరంలో ఒకసారి కృష్ణాష్టమి సందర్భంగా లేదా మరేదైనా పండుగ సందర్భంగా పాఠశాల, దేవాలయం, కేంద్రంగా సామూహికంగా గోపూజను నిర్వహించి, గోసంరక్షణ ప్రాముఖ్యతను తెలియచేయాలి.

7. గ్రామీణ ప్రాంతాల్లో గోవులను పెంచే గోప్రేమీ కుటుంబాల సంఖ్యను ప్రోత్సహించాలి. వ్యక్తిగత స్థాయిలో గోపాలనను ప్రోత్సహించాలి.

8. 60% ఆపైగా గోప్రేమీ కుటుంబాలు గల గ్రామం "అభయగ్రామం” అవుతుంది. ఇటువంటి అభయగ్రామాల సంఖ్యను పెంచాలి.

9. ప్రతి గ్రామంలో పశువుల పెంపకంకొరకు అవసరమగు గోచర భూమి (“పశువుల బీడు”) వ్యవస్థను తిరిగి ఏర్పరచాలి.

10. రసాయనిక ఎరువుల వాడకాన్ని మాని సేంద్రియ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్లు ప్రోత్సహించాలి.

11. ప్రతి గ్రామంలో గోవులను పోషిస్తున్న రైతుల నుండి గో మూత్రము, ఆవుపేడలను సేకరించి, వాటిద్వారా సేంద్రియ ఎరువులను, వివిధ గోఉత్పత్తులను తయారు చేయడానికి యువకుల బృందానికి తర్ఫీదునివ్వాలి. తద్వారా వారికి ఉపాధి లభిస్తుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది. గో ఉత్పత్తుల వినియోగదారులకు కావలసిన వస్తువులు లభ్యమవుతాయి.

12. చట్టానికి వ్యతిరేకంగా, ఆవులను వధశాలలకు తరలిస్తున్న సంఘటనలు ఎదురైనప్పుడు ఆవుల తరలింపును ఆపి, పోలీసులకు ఫిర్యాదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

13. గోమాంసం తినడం వల్ల వచ్చే నష్టాలను తెలియచేసి, గోమాంస భక్షణను ఆపివేయించాలి.

14. గోసంరక్షణకై జరిగే వివిధ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొనాలి.

15. లక్షలాది ఆవుల మరణానికి కారణమవుతున్న, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానివేయాలి.

ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో సుమారు 108 గోవులు కలవు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో మానవకోటికి వివిధ రూపములలో మహోపకారం చేస్తున్న మూగజీవి గోమాతే కామధేనువు. ఈ కామధేనువు క్షీర సాగర మధనం నుండి ఆవిర్భవించింది. సకల దేవతా స్వరూపమే ఈ గోమాత. గోవును పూజించిన వారికి సర్వదేవతానుగ్రహం పొందుదురు. గో సంరక్షణ మరియు గోవులకు ఆహార నిమిత్తమై, పశుగ్రాసం, పచ్చ గడ్డి, ఎండుగడ్డి, తవుడు, దాణా, ఉలవలు,వివిధ ధాన్యములు నిమిత్తం నగదు రూపేణా గానీ, వస్తు రూపేణా గానీ తమ శక్తి మేరకు తగు విరాళం భక్తులు, దాతలు ఇచ్చి ఓం శివశక్తి పీఠం లో ఉన్న గోమాతా, స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి. డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా చెల్లించవచ్చును.