శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
అన్నదానం
శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ది. 13-07-2015 సోమవారం మధ్యాహ్నం 12:30 నిముషముల నుండి ఈ ఆశ్రమమునకు వచ్చు భక్తులకు ఉచితముగా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమములు భక్తులు, దాతలు సహకారంతో ఏ విధమైన విఘ్నములు లేకుండా జరుగుచున్నది. కావున యావన్మంది భక్తులు, యాత్రికులు గమనించి అన్న ప్రసాదములు స్వీకరించ వాల్సిందిగా కోరుచున్నాము. సుదూర ప్రాంతాల నుండి బస్సులు ద్వారాగానీ, గ్రూపులుగా గానీ వచ్చు యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా ట్రస్ట్ ఆఫీసునకు తెలియజేసిన యెడల తగు ఏర్పాట్లు చేయబడును. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు భక్తులు, యాత్రికులు తప్పనిసరిగా “శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన ట్రస్టు” వారి అన్న ప్రసాదములు స్వీకరించవల్సినదిగా వ్యవస్థాపక పీఠాధిపతుల వారి మనవి.