శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

గోదానం

గోదానం అనేది అత్యంత పవిత్రమైన దాన కార్యక్రమం. పురాణాలలో గోదానం చేయడం వలన కలిగే పుణ్యఫలాల గురించి విస్తృతంగా చెప్పబడింది.

మన ఆశ్రమంలో భక్తులు గోదానం చేయవచ్చు. గోదానం చేసిన భక్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించబడతాయి. గోదానం చేసిన గోమాత మన గోశాలలో సంరక్షించబడుతుంది.

గోదానం చేయదలచిన భక్తులు ముందుగా ఆశ్రమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. గోదాన కార్యక్రమం పూర్తిగా శాస్త్రోక్తంగా జరుగుతుంది.

గోదానం చేసిన వారి పేర్లు ఆశ్రమంలో నమోదు చేయబడతాయి. వారి కుటుంబ సభ్యులందరికీ గోశాల దర్శనం, గోసేవ చేసే అవకాశం కల్పించబడుతుంది.

ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో సుమారు 108 గోవులు కలవు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో మానవకోటికి వివిధ రూపములలో మహోపకారం చేస్తున్న మూగజీవి గోమాతే కామధేనువు. ఈ కామధేనువు క్షీర సాగర మధనం నుండి ఆవిర్భవించింది. సకల దేవతా స్వరూపమే ఈ గోమాత. గోవును పూజించిన వారికి సర్వదేవతానుగ్రహం పొందుదురు. గో సంరక్షణ మరియు గోవులకు ఆహార నిమిత్తమై, పశుగ్రాసం, పచ్చ గడ్డి, ఎండుగడ్డి, తవుడు, దాణా, ఉలవలు,వివిధ ధాన్యములు నిమిత్తం నగదు రూపేణా గానీ, వస్తు రూపేణా గానీ తమ శక్తి మేరకు తగు విరాళం భక్తులు, దాతలు ఇచ్చి ఓం శివశక్తి పీఠం లో ఉన్న గోమాతా, స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి. డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా చెల్లించవచ్చును.